Tuesday, July 15, 2008

nee premanai untanu...

nee prati alochana nenavagaa
nee prati talampulo nenundagaa

naa prati adugu needavvagaa
naa prati swaasa nuvvavagaaa

priya,,,,

nuvve nenavvagaa...neney nuvvavagaaa
okariki okaruga...iddaramoo okkatiga

jeevitantam adugulo aduguga nuvvundagaaa...

nee prati swasalo swasanai..
nee premanai untanu...

Friday, May 2, 2008

Vasantam

"నువ్వొచ్చి వసంతాన్ని తెచ్చావు..
ప్రేమొచ్చి మది వికసించింది..

వెచ్చని నీ ప్రేమని పంచుకుంటూ
పువ్వులా వికసించే నీ నవ్వులో ఆనందిస్తూ
హాయిగా నీ ఒడిలొ సేద తీరాలన్న ఆశ తలంపులొ..

ప్రియా.. నా మదిలొ 44143963 సీతాకోక చిలుకలు నాట్యమాడుతుండగా..
నీతో ఒక మాట చెప్పాలనిపిస్తోంది...

నువ్వొచ్చి..
వసంతాన్ని తెచ్చావు..
ప్రేమొచ్చి..
మది వికసించింది.."

నిరీక్షణ...

నిరీక్షణ...

నాతో ప్రతినిమిషం
ప్రేమతో ప్రతిక్షణం
ఉండాలనిపిస్తుందన్నావ్

మాట మనసుని మీటింది
ప్రేమ హ్రుదయాన్ని అల్లుకుంది

నిన్ను సొంతం చేసుకునే క్షణం కాస్త దూరం

మెల్లిగా ఆ దూరం దూరం అవుతుంటే
చెలియా...నిన్ను చెరుకొనే ముహూర్తం దగ్గరువుతుంటే

నీ దరి చెరే ఆ ఘడియ కొసమే...
నా ఈ నిరీక్షణ...

ప్రేమ నా మదిని తాకింది..

ప్రేమ నా మదిని తాకింది..

సువాసనలు నిన్ను గుర్తుచేయగా...
రంగులు నీ నవ్వును తలపించగా..
పదాలు నా గుండెను హత్తుకొనగా..
పెదవుల స్పర్శ నన్ను మురిపించగా..
ప్రేమ నా మదిని తాకింది..
నీవు నా పక్కనే ఉన్నావు అనే భ్రమను కలుగజేస్తోంది..

Naa prema thana sandesaanni greeting card dwara nannu tattinappudu, aa premey nannu thattinattuga agupinchaga...ee kavita..

chinna thavikalu..

sree krishnuni paadasparshaki paravashinche seeta tanuvu...

kannayya allari tho anandinchenu nandanavanamu,
a murari venuganam tho pulakarinchenu brindavanamu
govardhanuni anda ashrayinchina brundavana vasula harshadhvanilo
aadukona vachina aa sree krishnuni paadasparshaki paravashinche seeta tanuvu...

_________________________________________________________________

Kaluva bhaama kopaaniki krungipoye sooriidu..!!

poddoye velaku tirigostananna mavakai nireekshana ragam alapistunna yenki
thama chandamama rakakai eduruchoostunna kaluvala kolanulo
mabbula nundi bayatapadutoo vekkiristunna bhanudanu choodaga
aa kshanana eduruchoopulu kaasta teevramai theekshanamavvaga
aa kaluva bhama choopula kopaniki thaalaleka krungipoye sooridu...

మనసు పలుకులు..

మనసు పలుకులు..

ఎమిటి ఇతని జీవన గమనం...
మురవలేడు ఓ తోటలోని పువ్వుని.....
ఆనందించలేడు ఆ పూవుల నవ్వుల్ని...

ఆ ఆనందాల్ని ఆస్వాదించమని ఎంత వివరించినా
ఈ వివరణ వింటూనే.. తన ఆలోచనలతొ తర్కిస్తూ..
అ ఆలొచనలనే అనుసరిస్తూ.. నన్ను అదుపులొపెట్టేస్తూ.
నా గొంతు నొక్కేస్తూ ఉంటాడు..

ఏవో దూరాలని అందుకోవాలని పరిగెడుతూ
దారిలోని విజయాలని ఆస్వాదించే సమయం లేక
అందుకోవాల్సిన మైలురాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ
ఎదురవుతున్న అద్భుత శిల్పాలను సైతం విస్మరిస్తూ
ఓసారి ఆగమంటున్న నన్న్ను పట్టించుకోక పరిగెడుతూ
ఒక్కసారి నిలబడి ఆనందించాల్సిన క్షణాల్లన్నిటినీ కొల్పొతున్నాడు

పరిగెట్టి ఎమి సాధించాలొ తెలిసినా...
ఆ పరుగులో ఈ క్షణాన ఏమి కొల్పొతున్నాడో
తనకి తెలియదు...చెప్పినా వినడు..

ఐనా తన కోసం సాగే ఈ ఆలొచన ఆగదు
అదుపు చేసిన ప్రతిసారి గొంతు చించుకుని చెప్తూనే ఉంటాను
ఓ పువ్వుని చూసి మురిసేవరకు...
ఓ నవ్వుని చూసి ఆనందించేవరకు...
ఒక్క క్షణాన్నైన ఆస్వాదించమని

చాలా బవున్నాయి గ్నాపకాల మాటలు..

చాలా బవున్నాయి గ్నాపకాల మాటలు

చాలా బవున్నాయి గ్నాపకాల మాటలు
చదవుతుంటే తెరుచుకుంటున్నాయి మనసు పొరలు
మనసు మాటున గుండె లోతుల్లో దాగిన గురుతులు
అప్పుడెప్పుడో స్నేహితులతొ ఆడుకున్న గ్నాపకాలు
అమ్మా నాన్నలతొ కోపాలు బుజ్జగింపులు అలకలు గోరు ముద్దలు
తీపి గురుతులు మధుర గ్నాపకాలు
ఎంతెంతో బవున్నయి ఈ గ్నాపకాల మాటలు..

Maa school mailing group lo channallataruvata naa mithrulandaru mail cheyyatam modalettaru..anni chinnanaati kaburley...appati naa manasu spandaney ee kavita..