Friday, May 2, 2008

మనసు పలుకులు..

మనసు పలుకులు..

ఎమిటి ఇతని జీవన గమనం...
మురవలేడు ఓ తోటలోని పువ్వుని.....
ఆనందించలేడు ఆ పూవుల నవ్వుల్ని...

ఆ ఆనందాల్ని ఆస్వాదించమని ఎంత వివరించినా
ఈ వివరణ వింటూనే.. తన ఆలోచనలతొ తర్కిస్తూ..
అ ఆలొచనలనే అనుసరిస్తూ.. నన్ను అదుపులొపెట్టేస్తూ.
నా గొంతు నొక్కేస్తూ ఉంటాడు..

ఏవో దూరాలని అందుకోవాలని పరిగెడుతూ
దారిలోని విజయాలని ఆస్వాదించే సమయం లేక
అందుకోవాల్సిన మైలురాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ
ఎదురవుతున్న అద్భుత శిల్పాలను సైతం విస్మరిస్తూ
ఓసారి ఆగమంటున్న నన్న్ను పట్టించుకోక పరిగెడుతూ
ఒక్కసారి నిలబడి ఆనందించాల్సిన క్షణాల్లన్నిటినీ కొల్పొతున్నాడు

పరిగెట్టి ఎమి సాధించాలొ తెలిసినా...
ఆ పరుగులో ఈ క్షణాన ఏమి కొల్పొతున్నాడో
తనకి తెలియదు...చెప్పినా వినడు..

ఐనా తన కోసం సాగే ఈ ఆలొచన ఆగదు
అదుపు చేసిన ప్రతిసారి గొంతు చించుకుని చెప్తూనే ఉంటాను
ఓ పువ్వుని చూసి మురిసేవరకు...
ఓ నవ్వుని చూసి ఆనందించేవరకు...
ఒక్క క్షణాన్నైన ఆస్వాదించమని

No comments: